ఇంట్లో ఈశ్వరలింగాలు 12 అంగుళాలు మించి ఉండకూడదని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుని బొమ్మలలోగాని, మూర్తిలోగాని పాదములుండకూడదని మత్స్యపురాణం చెబుతోంది.
నిజమైన బంగారు బొమ్మలేగాని కృత్రిమ బంగారం పూజకు పనికిరాదు. దేవపూజలో బంగారం, వెండి, ఇత్తడి, కంచు వీటిలో ఏదైనా ఒకదానిచేత తయారు చేయబడిన విగ్రహాన్ని పూజించవచ్చు. కానీ ఇళ్లల్లో శివలింగం మాత్రం 12 అంగుళాలకు మించి ఉండకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే శివపూజకు జిల్లేడు పువ్వు, మారేడు, తుమ్మి, ఉత్తరేణు ఆకులు, కుశఫలము, జమ్మి ఆకులు, నల్లకలువ దళములు, ఉమ్మెత్త పుష్పము, జమ్మి పువ్వులతో పూజించడం శ్రేయస్కరం. ఏరోజు కోసిన పువ్వులు, పత్రాలు ఆనాడే పూజకు ఉపయోగించాలి.
అయితే కోసిన పిమ్మట పద్మం ఐదు రాత్రుల వరకు, మారేడు దళాలు ఏడు రాత్రుల వరకు, తులసి పది రాత్రుల వరకు శివపూజకు పనికి వస్తాయి. ఈశ్వరునికి మారేడు ప్రీతికరం. సోమ, మంగళ, శుక్ర వారములు, సంక్రాతి రాత్రి పర్వతిథులు, ఆర్ద్రా నక్షత్రం రిక్త తిథులలో మాత్రం మారేడు కోయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.