శ్రీ గాయత్రి దేవికి నేతి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి సుమంగళులకు, బ్రాహ్మణ దంపతులకు నేతి అన్నాన్ని భోజనానికి వడ్డిస్తే మీకు మీ ఇంటిలోని వారందరకీ అన్ని రకాల శాపాలు, దిష్టిలు తొలగిపోతాయి. నేతి అన్నాన్ని మీ కుల దేవతకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.
అలాగే నేతి అన్నాన్ని ఈశ్వరునికి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని రకాల మృత్యువులు తొలగిపోతాయి. ఇక ధన్వంతరి దేవునికి నేతి అన్నం నైవేద్యంగా సమర్పించి ప్రసాదాన్ని తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా శ్రీ నరసింహ స్వామి నేతి అన్నాన్ని నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఎటువంటి మాంత్రిక ప్రయోగాలు నిర్వహించడం సాధ్యంకాదు. ఇదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నేతి అన్నాన్ని నైవేద్యంగా పెడితే మానసిక శాంతి, ప్రశాంతత లభిస్తాయి. దేహంలోని చర్మవ్యాధులు నివారింపబడుతాయి.
శ్రీ లక్ష్మీ నారాయణ దేవుడు, సాలగ్రామాలు, బవలమురి శంఖం, శ్రీ హేరంభ గణపతి, పాదాలు కనిపించే లక్ష్మి, ఈశాన్య దిక్కులో ఉండే లక్ష్మి, శ్రీ చక్రం, శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి, భువనేశ్వరి దేవి వంటి దేవతలకు నేతి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని సుమంగళులకు వడ్డిస్తే మీ ఇంట్లో సుఖం, శాంతి, ప్రశాంతత, సంతోషం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.