మహిళల్లో అత్యంత సౌందర్యవంతమైన భాగం ఏంటని అంటే వక్షోజాలేనని చెపుతుంటారు. పురుషుడు ఓ స్త్రీ పట్ల ఆకర్షితుడవడం వెనుక ప్రధాన కారణంగా వక్షోజాలను చెపుతుంటారు. అందువల్లనే మహిళలు తమ స్తన సౌందర్యం పట్ల అత్యంత శ్రద్ధాసక్తులను చూపుతారు. అయితే అంతకుమించి వాటి గురించి వారేమీ పట్టించుకున్నట్లు కనబడరు.
ఐతే పురుషుడ్ని రతి సమయంలో కోర్కెను తారాస్థాయికి తీసుకవెళ్లగలిగే శక్తి ఈ వక్షోజాలకు ఉన్నదని సెక్సాలజిస్టులు చెపుతారు. అలాంటి ఈ పాలిండ్ల వెనుక కొందరికి తెలియని వాస్తవాలు ఉన్నాయంటున్నారు. అవేంటో చూద్దాం.
* కుడివైపు ఉన్న వక్షోజం కంటే ఎడమవైపు వక్షోజం పెద్దదిగా ఉంటుంది. అవి రెండూ ఒకే సైజులో ఎప్పటికీ ఉండవు. అంతేకాదు వక్షోజాగ్ర ఆకృతుల్లోనూ తేడా ఉంటుంది. వీటి దిశలు కూడా ఒకేలా ఉండవు.
* మరో వాస్తవం ఏమంటే... ప్రతి మహిళ యొక్క పాలిండ్లపై 2 నుంచి 10 దాకా రోమాలు ఉంటాయి. వాటిని నిశితంగా గమనిస్తే చూడవచ్చు. అంతేకాదు... వక్షోజాలకు నల్లటి మచ్చలు, మొటిమలు కూడా వస్తుంటాయి. అందువల్ల పురుషుడ్ని తృప్తిపరిచేందుకు ఈ విషయంలో మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.
* ఒక్కో వక్షోజం బరువు సుమారుగా అరకేజీ ఉంటుంది. శరీర కొవ్వులో 4 నుంచి 5 శాతం వక్షోజాలు కలిగి ఉంటాయి. చెప్పాలంటే శరీర బరువులో వక్షోజాల బరువు ఒక శాతంగా చెపుతారు.
* ప్రపంచంలో సుమారు 20 లక్షల మంది మహిళలు నకిలీ వక్షోజాలను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఇలా నకిలీ పాలిండ్లను కలిగి ఉన్నవారిలో పమేలా ఆండర్సన్, కేటీ ప్రైస్ తో పాటు మన దేశంలో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వంటివారు వీటిని కలిగి ఉన్నారు. దీన్నిబట్టి వక్ష సౌందర్యానికి మహిళలు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అర్థమవుతుంది. ఇకపోతే ఇలా కృత్రిమ వక్షోజ సౌందర్యం కోసం ఎగబడటం కూడదంటున్నారు. వీటి వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
* వక్షోజ ఆకృతులకు తగిన బ్రాలను ధరించనట్లయితే వాటి ఆకృతుల్లో తేడాలు వచ్చి ఆకర్షణలో తేడా రావచ్చు. ముఖ్యంగా జాగింగ్, నడక, ఏరోబిక్స్ చేసేటపుడు వక్షోజాలను బిగుతుగా పట్టి ఉంచే బ్రాలను మాత్రమే ధరించాలి. వదులుగా ఉండే పెట్టీ కోటులను ధరించినట్లయితే ఆకృతుల్లో తేడాలు రావచ్చు. ఇకపోతే మరీ బిగుతుగా ఉండే బ్రాలను ధరిస్తే వక్షోజాలకు నొప్పి కలిగే అవకాశం ఉంటుంది. కనుక సైజులను బట్టి సరియైన బ్రాలను ఎంపిక చేసుకోవాలి.
* నిద్రించేటపుడు వక్షోజాలకు సపోర్ట్ అవసరం. ముఖ్యంగా ప్రక్కగా తిరిగి పడుకునేటపుడు వక్షోజాలకు సపోర్టుగా దిండులాంటి అమరికను పెట్టుకోవడం మంచిది. ఇదే నిద్రించేటపుడు అత్యుత్తమమైన భంగిమ.